బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని బ‌ల్కంపేట ఎల్లమ్మ క‌ల్యాణ మ‌హోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 5వ తేదీన అమ్మవారి కల్యాణోత్సవం జ‌ర‌గ‌నుంది. 6వ తేదీన రథోత్సవం నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎల్లమ్మ క‌ల్యాణ మ‌హోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు అసౌకర్యానికి గురికాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.