చిన్న వానకే… చిత్తడైన స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ

చిన్న వానకే… చిత్తడైన స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీగా పేరొందిన గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ పరిస్థితి . చిన్న వానకే రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. మంగళవారం ఉదయం కొద్ది సేపు పడిన వర్షానికే హనుమకొండలోని పలు రోడ్లు నీటి గుంతలను తలపించాయి.

రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడం, దీనికి తోడు ఎక్కడపడితే అక్కడ నీరు నిలుస్తుండడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో పడిన వానకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వానాకాలం సంగతి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

- వెలుగు ఫొటో గ్రాఫర్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌