వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసం.. ప్రయాణికులకు నరకం

వర్షాలకు  రోడ్లన్నీ ధ్వంసం.. ప్రయాణికులకు నరకం

ఎడతెరిపిలేని వర్షాలకు హైదరాబాద్ లో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. ప్రధాన రహదారుల నుంచి .. కాలనీలోని రోడ్ల వరకు గుంతలమయం అయ్యాయి. నాసిరకం రోడ్ల వేయడం వల్లే డ్యామేజ్ అయ్యాయని నగర వాసులు ఆరోపిస్తున్నారు. రోడ్లపై ప్రయాణించాలంటే భయపడుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా వర్షాలకు రోడ్ల డ్యామేజ్  భారీగా జరిగింది. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర సమీపంలోని గుండ్లవాగు బ్రిడ్జి దగ్గర రోడ్డు రిపేర్ పనులు నిలిచిపోయాయి. నిన్నమొన్న కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతినడంతో తిరిగి కొత్త రోడ్డు వేస్తున్నారు. మొత్తం బురదమయం కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఏటూరునాగారం - ములుగు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోడ్లు ధ్వంసం అయ్యియి. అశ్వరాపుపేటలో పలు పార్టీల నేతలు వినూత్న నిరసన చేపట్టారు. అశ్వారావుపేట-వేలేరుపాడు ప్రధాన రహదారి బురదమయం కావడంతో రోడ్డుపై వరినాట్లు వేస్తూ నిరసన తెలిపారు. వరదలో సైతం ఏపీ నుంచి భారీగా ఇసుకలారీలు రావడంతో రోడ్లు దెబ్బతిన్నాయని నేతలు ఆరోపంచారు. పరిమితికి మించిన హెవీ లోడ్ తో తిరుగుతున్న ఇసుక లారీల వల్లే తమ ప్రాంతంలోని రోడ్లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.