సొంతూళ్లకు జనం..హైదరాబాద్ రోడ్లు ఖాళీ

సొంతూళ్లకు జనం..హైదరాబాద్ రోడ్లు ఖాళీ

హైదరాబాద్  నుంచి పలు  ప్రాంతాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నగరంలోని రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్​ రద్దీతో ఉండే రోడ్లన్నీ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గత మూడు రోజులుగా భారీ సంఖ్యలో ప్రజలు తమ సొంతూళ్లకు వెళుతున్నారు. 

నగరంలోని మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, కేపీహెచ్​బీ, హైటెక్ సిటీ, మాదాపూర్, ఐటీ కారిడార్, ఎల్బీ నగర్, మణికొండ, పంజాగుట్ట, బంజారా హిల్స్, బేగంపేట  తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

గత మూడు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు లక్షలాది  మంది సొంతూళ్లకు వెళ్లారు. ప్రైవేట్ ​ బస్సుల్లో .. ప్రత్యేక రైళ్లలోనూ  సొంతూళ్లకు వెళ్లారు.  నిత్యం బిజీగా కనిపించే హైటెక్​సిటీ, ఐటీ కారిడార్, ఐకియా వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ బోసిపోయాయి.