వ్యక్తిగత కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేసి ఉంటారు : ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

వ్యక్తిగత కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేసి ఉంటారు :  ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై  వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆర్కే రాజీనామా చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. రెండుసార్లు ఎమ్మెల్యే గా ఆర్కే బాగా పనిచేసారని కొనియాడారు.  అసంతృప్తి అనేది ఆయనకు లేదని చెప్పుకొచ్చారు. 

మంగళగిరి సీటును బీసీ(పద్మశాలి)లకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు అయోధ్య రామిరెడ్డి.  అందుకే గంజి చిరంజీవిని ఇంచార్జ్ గా ప్రకటిస్తున్నామని తెలిపారు.  రాజకీయ సమీకరణాల వలనే మార్చడం జరిగిందన్నారు.  ఆర్కే సీఎం జగన్ వెంటే నడుస్తారని ఆశీస్తున్నామన్నారు.  

 మళ్లీ మంగళగిరిలో వైఎస్సార్‌సీపీనే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు అయోధ్య రామిరెడ్డి. పదేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేశా అనే సంతృప్తిలో ఆర్కే ఉన్నారని తెలిపారు.  రాజకీయ సమీకరణాల వల్లే ఆర్కేకు మంత్రి పదవి దక్కలేదని వెల్లడించారు.  

రాబోయే ఎన్నికల్లో మంగళగిరి సీటు చిరంజీవికే అని అధిష్టానం కన్ఫామ్ చేసినట్లు సమాచారం ఉండటంతోనే.. ఆళ్ల రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మంగళగిరి నియోజకవర్గంలో చిరంజీవికి చెందిన సామాజిక వర్గం (పద్మశాలి) ఓట్లు అత్యధికంగా ఉండడం.. ఫస్ట్ టైం చిరంజీవిపైనే కేవలం 14 ఓట్ల తేడాతో గెలిచారు ఆళ్ల.. రెండోసారి నారా లోకేష్ పై గెలిచాడు. 

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్లను కాదని.. రాబోయే ఎన్నికల్లో చిరంజీవికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలోనే.. రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.