ఉత్తమ్ కుమార్​పై ఆరోపణలు కరెక్ట్ కావు : జగ్గారెడ్డి

ఉత్తమ్ కుమార్​పై ఆరోపణలు కరెక్ట్ కావు : జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి నిరాధరమైన ఆరోపణలు చేస్తూ, బట్టకాల్చి మీదేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మహేశ్వర్ రెడ్డికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదన్నారు. ఇప్పటికైనా అనవసర ఆరోపణలు చేయడం ఆపాలని సూచించారు. 

గురువారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల, రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. వర్షాలకు తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని సీఎం, మంత్రులు స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. రైతులు, రైస్ మిల్లర్లు నష్టపోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఐదేండ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని, ఆయనను ఎవరూ డిస్టర్బ్​ చేయరన్నారు.