భారత్‌‌‌‌‌‌‌‌ సమిట్‌‌‌‌‌‌‌‌ పేరుతో దేశ వ్యతిరేక కుట్రలు..రేవంత్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

భారత్‌‌‌‌‌‌‌‌ సమిట్‌‌‌‌‌‌‌‌ పేరుతో దేశ వ్యతిరేక కుట్రలు..రేవంత్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • ఇటలీ నేత వ్యాఖ్యల వెనుక సీఎం మాస్టర్‌‌‌‌‌‌‌‌మైండ్‌‌‌‌‌‌‌‌
  • రాహుల్‌‌‌‌‌‌‌‌ మెప్పు కోసం రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన భారత్‌‌‌‌‌‌‌‌ సమిట్‌‌‌‌‌‌‌‌-2026 వేదికగా దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని సీఎం  రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇటలీ నేత ఫిలిబెక్‌‌‌‌‌‌‌‌తో ‘ఓట్‌‌‌‌‌‌‌‌ చోర్‌‌‌‌‌‌‌‌.. గద్దీ ఛోడ్‌‌‌‌‌‌‌‌’ నినాదాలు చేయించడం వెనుక సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డే ఉన్నారని ఆరోపించారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరుస ఎన్నికల్లో ఓటములతో రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ అసహనంతో సొంత దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఏలేటి విమర్శించారు.

ఇటలీ నేత ఈసీ, ప్రజాతీర్పును విమర్శిస్తుంటే రాహుల్‌‌‌‌‌‌‌‌ చప్పట్లు కొట్టి ప్రోత్సహించారని ఆరోపించారు. ఇది భారత్‌‌‌‌‌‌‌‌ సమిట్‌‌‌‌‌‌‌‌ కాదని, యాంటీ భారత్‌‌‌‌‌‌‌‌ సమిట్‌‌‌‌‌‌‌‌ అని వ్యాఖ్యానించారు. సదస్సు నిర్వాహకులపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా రైతులకు పరిహారం ఇవ్వకుండా, రాహుల్‌‌‌‌‌‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ పెంచేందుకు సమిట్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారని ఏలేటి ఆరోపించారు. ఇందుకోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఎన్నికల కోసం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మూడేళ్లలో రూ.3 వేల కోట్లు ఖర్చు చేసిందంటూ కూడా ఆరోపణలు చేశారు. కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ వీసా నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఫిలిబెక్‌‌‌‌‌‌‌‌ వీసా రద్దు చేసి, బ్లాక్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెట్టి దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.