
రాజీవ్ స్వగృహ టోకెన్అమౌంట్కు ముగిసిన గడువు
లాటరీదారుల డౌట్లకు జవాబు చెప్పని అధికారులు
ఇప్పటికే గడువు పొడిగింపు
మళ్లీ పెంచుతారో లేదో క్లారిటీ లేదు
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ల అమ్మకం ద్వారా రూ.800 కోట్లు ఆర్జించాలన్న సర్కారు కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. లాటరీలో ఫ్లాట్లు దక్కిన మొత్తం 3,895 మందికి లెటర్లు పంపగా 70 శాతం మంది టోకెన్అమౌంట్కట్టలేదని తెలుస్తోంది. టోకెన్ అమౌంట్‌కు గడువు శనివారంతో ముగిసింది. ఇప్పటికే అమౌంట్ కట్టకపోవడంతో అధికారులు గడువు పెంచారు. ఇపుడు మళ్లీ పొడిగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎంత మంది టోకెన్అమౌంట్కట్టారన్న వివరాలను హెచ్ఎండీఏ, హౌసింగ్ అధికారులు సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఇక టోకెన్ అమౌంట్ కట్టిన ఫ్లాట్ ఓనర్లు అడుగుతున్న సందేహాలను అధికారులు తీర్చడం లేదు. దీంతో నిత్యం వందల మంది బండ్లగూడ, పోచారం, హిమాయత్ నగర్ లోని హౌసింగ్ అధికారుల దగ్గరకు వెళ్తున్నారు. తమదేం లేదని, హెచ్ఎండీఏ అధికారులను అడగాలని వినతిపత్రాలను హౌసింగ్ అధికారులు తీసుకుంటున్నారు.
అధికారుల తీరుతో లాటరీదారుల వెనుకడుగు
రాజీవ్ స్వగృహ వేలం పాట స్టార్ట్ అయిన నాటి నుంచి అధికారుల తీరుపై పబ్లిక్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అప్లికేషన్ పెట్టుకున్న వారు అడుగుతున్న సందేహాలకు అధికారులు జవాబు చెప్పడం లేదు. ఇప్పటికే బండ్లగూడలో ఉంటున్న చాలా మంది ఓనర్లు సుమారు రూ.6 కోట్ల నీటి బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీటిని వసూలు చేయాలని అధికారులకు చెబుతున్నా స్పందించడం లేదంటున్నారు. ఇపుడు వేలం పాట టైమ్ లో, లాటరీలో ఫ్లాట్లు వచ్చిన వారికి కూడా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు. పార్కింగ్, బ్లడ్ రిలేషన్ కు ఫ్లాట్ బదిలీ, సేల్ డీడ్ సమస్యలను ప్ర స్తావిస్తున్నారు. టోకెన్ అమౌంట్ కట్టిన వాళ్లకు ఫ్లాట్ కీ (తాళంచెవి) ఇవ్వాలని, ఇస్తే రిపేర్లు చేయించుకుంటామని చెబుతున్నా అధికారులు రెస్పాండ్కావడం లేదు. ఐటీ కట్టని వాళ్లకు బ్యాంక్ అధికారులు లోన్లు నిరాకరిస్తుండడంతో తమ సొంత వాళ్ల పేరు మీద ఫ్లాట్ ను బదిలీ చేయాలని కోరుతున్నారు. దీనిపై కూడా అధికారులు పెదవి విప్పడం లేదు.
హెచ్ఎండీఏ నేతృత్వంలోనే..
రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల, నోటిఫికేషన్, వేలంపాట అ న్ని వ్యవహారాలను మొదటి నుంచీ హెచ్ఎండీఏనే చూస్తోంది. హౌసింగ్ డిపార్ట్ మెంట్ నామమాత్రంగా ఉందని చర్చ జరుగుతోంది. హౌసింగ్, హెచ్ఎండీఏ ల మధ్య సమన్వయ లోపం లేదని పలువురు లాటరీదారులు చెబుతున్నారు. ఫ్లాట్లు దక్కిన వారి సందేహాలు తీర్చాలని హౌసింగ్ అధికారుల దగ్గర వస్తున్న వినతిపత్రాలను తీసుకొని హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు.