ఇష్టమైతే.. నా మనసుకు నచ్చితే వస్తా : అల్లు అర్జున్

ఇష్టమైతే.. నా మనసుకు నచ్చితే వస్తా : అల్లు అర్జున్

రావు రమేష్ లీడ్ రోల్‌‌‌‌లో లక్ష్మణ్ కార్య రూపొందించిన  చిత్రం ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. సుకుమార్ భార్య తబిత సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. బుధవారం ప్రీ రిలీజ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ మూవీ ప్రొడక్షన్‌‌‌‌లో భాగమైన సుకుమార్ గారి భార్య తబితను అభినందిస్తున్నా. ఆవిడది కంఫర్టబుల్ లైఫ్. కానీ, ఏదో ఒకటి చేయాలనే తపనతో సినిమా చేశారు. ఫ్రెండ్ అనుకో, ఇంకొకరు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకోండి.. 

ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిలబడాలి. నాకు ఇష్టమైతే వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా. అది అందరికీ తెలిసిందే. ఈ సినిమా  సక్సెస్ సాధించి టీమ్‌‌‌‌ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా. ఇక ‘పుష్ప2’ విషయంలో అసలు తగ్గేదేలే’ అని చెప్పాడు.  సుకుమార్ మాట్లాడుతూ ‘మా ఆవిడ ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తుంది. సినిమా చూశా. చాలా బాగుంది. లక్ష్మణ్ కార్య అద్భుతంగా తీశాడు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘మారుతి నగర్ సుబ్రమణ్యానిది ఓ యుద్ధం. అతను ఓ నూతిలో కప్ప. అన్నీ తెలుసన్నట్టు కనిపిస్తాడు. 

కానీ  ఏమీ తెలియదు. నన్ను అప్డేట్ చేయమని కొడుకును అడుగుతాడు. ఇటువంటి అద్భుతమైన ప్రపంచాన్ని దర్శకుడు లక్ష్మణ్ కార్య సృష్టించాడు. అందులో గొప్ప హ్యూమర్ రాశాడు. అందర్నీ ఆకట్టుకుంటుంది’ అని రావు రమేష్ చెప్పారు. థియేట్రికల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇచ్చే చిత్రమిది అని దర్శకుడు లక్ష్మణ్ అన్నాడు. నటులు రమ్య పసుపులేటి,  ఇంద్రజ, అంకిత్  కొయ్య, బిందు సహా టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.