Allu Arjun: పవన్‌ కల్యాణ్‌కు అల్లు అర్జున్ బర్త్డే విషెస్‌..అభిమానులను ఆకర్షిస్తోన్న బన్నీ పోస్ట్

Allu Arjun: పవన్‌ కల్యాణ్‌కు అల్లు అర్జున్ బర్త్డే విషెస్‌..అభిమానులను ఆకర్షిస్తోన్న బన్నీ పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇవాళ (సెప్టెంబర్ 2న) తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, జనసైనికులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా పవన్‌ కల్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే పవర్‌ స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారు’ అన్ని బన్నీ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, అల్లు అర్జున్ పోస్ట్ మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య కాస్తా రిలాక్స్ ను అందిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు.

అసలేమైందంటే:

మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందంటూ వస్తున్న వార్తలు గత కొన్ని నెలలుగా వస్తున్నాయి. దీంతో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఎక్స్‌లో వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. దానికి కారణం..ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం చేస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వైసీపీకి సపోర్ట్ గా నిలిచారు. దీంతో మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు..మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని తీవ్రగా వ్యతిరేకించారు. పార్టీలకీ అతీతంగా కేవలం ఆయనతో ఉన్న స్నేహంతోనే అక్కడికి వచ్చానని బన్నీ చెప్పుకొచ్చినా మెగా ఫ్యాన్స్ దాన్ని తీసుకోలేకపోయారు.

ఇకపోతే ఇటీవల అడవుల సంరక్షణ గురించి బెంగళూరులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘40 సంవత్సరాల క్రితం సినిమాల్లోని హీరోలు అడవులను కాపాడేవారు. కానీ ఇప్పుడు ఆ హీరోనే అడవులను నరికేసి స్మగ్లింగ్‌ చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ చేశాడని భావించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

ALSO READ : Bigg Boss Today Promo: తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య కొట్లాట..ప్రోమోతో షోపై పెరిగిన అంచనాలు

అలాగే ఇవటీలే అల్లు అర్జున్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ‘‘నచ్చిన వాళ్ల కోసం నిలబడాలి. నేను నిలబడతాను. నా అనుకునే వాళ్లకోసం ఎంత దూరమైనా వస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. దాంతో అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్‌ మరోసారి చర్చనీయాంశమైంది.ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్..పవన్ కు విషెష్ చెబుతారా లేదా అనేది ఆసక్తి నెలకొనదాంతో..తాజా ట్వీట్ ఉపశమనం ఇస్తుంది.