ప్రపంచాన్ని ఏదో శక్తి నడిపిస్తుంది : అల్లు అర్జున్

ప్రపంచాన్ని ఏదో శక్తి నడిపిస్తుంది : అల్లు అర్జున్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun)కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు(National award) అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన 69వ జాతీయ అవార్డ్స్(69th National awards) లో పుష్ప సినిమాకు గాను ఆయన ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ తన డివోషనల్ లైఫ్ కి సంబంధించి. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పలు ఇంటర్వ్యూలో తెలియజేశారు.  

అల్లు అర్జున్ చాలా తక్కువ సార్లు టెంపుల్స్ని, పుణ్యక్షేత్రాలని విజిట్ చేస్తారని సమాచారం. అలాగే, దేవుడ్ని నమ్మడంలో మాత్రం ఆలోచనలన్నీ డిఫరెంట్గా ఉంటాయని..కానీ ఏదో శక్తి మాత్రం ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందనే బలమైన నమ్మకం మాత్రం ఉందని పేర్కోన్నారు. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడంతో..తన అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఇండస్ట్రీ తో పాటు ఇండియా వైడ్ గా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ దైవ భక్తి కలిగి ఉన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల షూటింగ్స్ అయిపోగానే హిమాలయాలకు వెళ్ళొస్తారు. 
బాల కృష్ణ సైతం తన మూవీస్ నుంచి ఎటువంటి అప్డేట్ రిలీజ్ కావాలన్న..ముహూర్త బలం నమ్ముతారు. 

ఇక అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విషయానికి వస్తే.. 70 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలోఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. దీంతో ఐకాన్ స్టార్ కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. టాప్ సెలబ్రేటీలు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు పంపుతున్నారు.