
‘పుష్ప 2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ప్రెస్టేజియస్ సినిమాలో నటించబోతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ మూవీ ప్రిపరేషన్స్‌లో ఉన్న అల్లు అర్జున్.. సడన్‌గా బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ఆయనతో కలిసి కొంత సమయం ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇది సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2023లోనూ ఓ వివాహ వేడుకలో వీళ్లిద్దరూ కలిసి మాట్లాడిన ఫొటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి.
మళ్లీ ఇప్పుడు భేటీ కావడంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని ఆశిస్తున్నారు అభిమానులు. ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహా భారతం’ వివరాలను తెలియజేసిన ఆమీర్ ఖాన్.. ఆయా పాత్రలకు సరిపోయే నటులను ఎంపిక చేస్తామని చెప్పారు. దీంతో బన్నీ ఇందులో నటించబోతున్నారా, లేక వీళ్లిద్దరూ కలిసి మరేదైనా ప్రాజెక్ట్‌కు వర్క్ చేయబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి కేవలం స్నేహపూర్వకంగా కలిశారా లేక ఏదైనా ప్రాజెక్ట్ విషయంపై చర్చించారా అనేది తెలియాల్సి ఉంది.