షారూఖ్ తరహాలో..ఇంటి దగ్గర ఫ్యాన్స్కు అల్లు అర్జున్ విషెస్

షారూఖ్ తరహాలో..ఇంటి దగ్గర ఫ్యాన్స్కు అల్లు అర్జున్ విషెస్

టాలీవుడ్ నుంచి ఎందరో స్టార్స్ వచ్చారు. మరెందరో తమ స్థానాలను ఇండస్ట్రీలో పదిల పరుచుకున్నారు. కానీ ఏ నటుడికి ఉత్తమ జాతీయ అవార్డ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ది రైజ్‌' మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బన్నీకి జాతీయ అవార్డు రావడంతో వరల్డ్ వైడ్గా ఎంతో ఫేమస్ అయ్యారు. 

లేటెస్ట్గా..హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటికి భారీగా అభిమానులు తరలొచ్చారు. దీపావళి స్పెషల్గా బన్నీకి విషెష్ తెలియజేయడానికి చాలా దూరం నుంచి ఫ్యాన్స్ రావడంతో పాటు..'దీపావళి శుభాకాంక్షలు సార్' అని నినాదాలు చేస్తూ హోరెత్తించారు.

దీంతో తన ఫ్యాన్స్ను కలవడానికి అల్లు అర్జున్ బయటికి వచ్చి..ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ, చేయి ఊపుతూ..విషెష్ తెలియజేశాడు.ఈ వీడియోలో అల్లు అర్జున్ ఆఫ్ వైట్ కుర్తా మరియు వైట్ స్నీకర్స్‌లో కనిపిస్తూ..స్మార్ట్ వాచ్, సన్ గ్లాసెస్తో ఫ్యాన్స్కి దర్శనం ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. షారూఖ్ తరహాలోనే.. ఇంటి దగ్గర ఫ్యాన్స్కు..అల్లు అర్జున్ విషెస్ చెప్పడంతో..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అంతేకాకుండా..అల్లు అర్జున్కి తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అభిమానులున్నారు.బన్నీఫేస్బుక్ లో సుమారు రెండు కోట్ల మంది అభిమానులున్నారంటే..క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ఇట్టే అర్థమైతుంది. కేరళలో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్..మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుస్తారు.