రివ్యూ: పుష్ప

రివ్యూ: పుష్ప

రివ్యూ: పుష్ప
రన్ టైమ్ : 2 గంటల 59 నిమిషాలు
నటీనటులు : అల్లు అర్జున్,రష్మిక,సునీల్, ఫహద్ ఫాసిల్, అజయ్ ఘోష్,ధనంజయ, అనసూయ,జగదీష్ తదితరులు
సినిమాటోగ్రపీ: క్యూబ
మ్యూజిక్ : దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాతలు: రవిశంకర్,నవీన్ యేర్నేని
రచన,దర్శకత్వం: సుకుమార్
రిలీజ్ డేట్: డిసెంబర్ 17,2021

ఆర్య,ఆర్య 2, ల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ అంటే క్రేజ్ బాగా ఉంది.పుష్ప ప్యాన్ ఇండియా సినిమా కావడం,ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్,రెండు పార్టులుగా తీయడం వల్ల అంచనాలు పెరిగాయి.వర్క్ అవ్వకముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి హడావుడిగా రిలీజ్ చేసిన సినిమా ఇది.
ఇక కథలోకి వెళితే.. పుష్ప రాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే బ్యాచ్ లో కూలీ గా చేరుతాడు.తన తెలివితో అంచెలంచెలుగా ఎదిగి ఆ దందాలో ఎలా డాన్ అయ్యాడనేది కథ.అందులో అతని ప్రేమ కథ, తన ఫ్యామిలీ ఇబ్బందులు ఉప కథలు గా ఉంటాయి. మూవీ కామన్ ఆడియన్ కు నచ్చుతుంది.

నటీనటుల పనితీరు:

అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడు. వేరే నటీనటులు,టెక్నీషియన్ల పనితనం బన్నీ నటన ముందు పెద్దగా కనిపించవు.అంతలా అన్నీ తానై నటించాడు.తన అటిట్యూడ్,డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కానీ సుకుమర్ బ్రిలియన్స్ మాత్రం పెద్దగా కనిపించదు.

స్టోరీ

సినిమా కథ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ పాయింటే. ఓ మాములు దొంగ తన తెలివితో ఆ సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడనేది మెయిన్ పాయింట్.ఇందులో చివరికి ఏం అవుతుందో ముందే ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. అందువల్ల స్క్రీన్ ప్లే ముఖ్యం.కానీ సుకుమార్ రైటింగ్ అంతలా మెప్పించేలా లేదు.ఫస్టాఫ్ యాక్షన్ ఎపిసోడ్లు,బన్నీ నటన మూలంగా అదిరిపోయింది కానీ..సెకండాఫ్ లో తేడా కొట్టింది. పార్ట్ 2 కోసం ఫహద్ ఫాసిల్ ఎపిసోడ్ ల్యాగ్ చేసారు.తన ఎంట్రీ బాగున్నా కానీ.. క్లైమాక్స్ లో ఫోర్స్ డ్ గా ఓ ఎపిసోడ్ ను క్రియేట్ చేసారు.అది బోరింగ్ గా ఉంది. 
రష్మిక శ్రీవల్లిగా మెప్పించింది.విలన్ గా సునీల్ వీక్ అయ్యాడు. అతని కన్నా..అజయ్ ఘోష్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంది.దనంజయ రెగ్యులర్ రోల్ లో ఓకే అనిపించాడు.అనసూయ కు కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.అజయ్ ఫర్వాలేదు. రావు రమేష్ కు సరైన ఇంపార్టెన్స్ లేదు.

టెక్నికల్ వర్క్:

టెక్నీషియన్ల విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ అధ్బుతంగా ఉంది.క్యూబాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటల్లో రెండు బాగున్నాయి. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో డిజప్పాయింట్ చేశాడు. సెకండాఫ్ లో కొన్ని సీన్లను హైలైట్ చేయాల్సిన టైమ్ లో దేవీ అనుకున్నంత ఆర్.ఆర్ ఇవ్వలేకపోయాడు.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది.చాలా సీన్లలో ల్యాగులు ఉన్నాయి. సుకుమార్ రాసుకున్న డైలాగులు బాగున్నాయి.కానీ విజిల్స్ కొట్టేంతలా పేలలేవు.మంచి బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న సుకుమార్ , కథనంలో తన మార్కు చూపించలేకపోయాడు. పార్ట్ 2 ఎఫెక్ట్, రిలీజ్ డేట్ ప్రెషర్  కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓవరాల్ గా రంగస్థలం లాంటి గుర్తిండిపోయే సినిమా కాదు కానీ..కమర్షియల్ గా ఈ సినిమా బాగా ఆడుతుంది. 
 

బాటమ్ లైన్: కొంచెం తగ్గింది లే

 

మిస్ వరల్డ్ ఫైనల్స్ వాయిదా

మాంసానికి డిమాండ్.. వీధి కుక్కల స్మగ్లింగ్