నిమిషానికి 10 కోట్లు.. రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్.. కారణం ఏంటో తెలుసా?

నిమిషానికి 10 కోట్లు.. రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్.. కారణం ఏంటో తెలుసా?

పుష్ప(Pushpa) సినిమాతో పాన్‌ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun). సినిమాలో పుష్పరాజ్ గా ఆయన నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అందుకే నేషనల్ అవార్డు సైతం ఆయన్ని వరించింది. దీంతో.. అయనతో సినిమాలు చేసేందుకు స్టార్ మేకర్స్ క్యూ కడుతున్నారు. ఎంతకావాలంటే అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. టాప్ బ్రాండ్స్ సైతం తమ యాడ్స్ కోసం బన్నీను అడుగుతున్నారు. తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయమంటూ.. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. 

తాజాగా అలాంటి ఒక బ్రాండ్ బన్నీకి అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చింది. కేవలం నిమిషానికి రూ.10 కోట్లు ఇస్తామన్నారు. కానీ.. ఆ ఆఫర్ ను బ్యాంక్ సున్నితంగా తిరస్కరించారట. కారణం.. అది ప్రజలకు హానికరం చేసే వస్తువు కాబట్టి. మద్యం, సిగరెట్స్, గుట్కా వంటి యాడ్స్‌లలో నటిస్తే.. సమాజంలో చెడును ప్రోత్సహించినట్టు అవుతుందని అన్నారట బన్నీ. అందుకోసం రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ను కూడా సింపుల్ గా రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ న్యూస్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఆవుతున్నారు. మా బన్నీ అన్న బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పతో ఇండియా వైడ్ భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ పుష్ప2 తో వెయ్యి కోట్ల మార్కును టచ్ చేయనున్నాడు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.