అల్లు అర్జున్ సరసన రష్మిక

 అల్లు అర్జున్ సరసన రష్మిక

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన నటించనున్న సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ అఫీషియల్ గా తెలుపుతున్నారు మేకర్స్.  ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు బన్నీ. MCA ఫేం వేణు శ్రీరామ్‌ డైరెక్షన్ లో ‘ఐకాన్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కనబడుటలేదు అనేది ట్యాగ్‌ లైన్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఆ తర్వాత  సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌లో రానున్న ఈ సినిమా.. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తో నటించే చాన్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపింది రష్మిక. బన్నీతో నటించడం సో ఎక్సైటెడ్ అని ట్వీట్ చేసింది రష్మిక. మొత్తానికి  ఈ బర్త్ డేతో వచ్చే ఏడాది వరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.