బన్నీ, త్రివిక్రమ్ మూవీ.. షూటింగ్ తేది ఖరారు

బన్నీ, త్రివిక్రమ్ మూవీ.. షూటింగ్ తేది ఖరారు

అల్లు అర్జున్, డైరెక్టర్ తివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రానుందనే సంగతి సినీ అభిమానులందరికీ తెలిసిందే.  అయితే తాజాగా ఆ సినిమాకు సంబంధించి ఈ రోజు ఓ అధికార ప్రకటన విడుదలైంది.  ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

అల్లు అర్జున్ కి ఇది 19 వ సినిమా. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్ మరియు ఎస్. రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి విజయం కావడంతో ఈ సినిమాపై బన్ని అభిమానులు ఎన్నో అంచనాలతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.