బేబీ సినిమా కోసం కొత్త క్లైమాక్స్.. అల్లు అరవింద్ నైస్ డెసిషన్

బేబీ సినిమా కోసం కొత్త క్లైమాక్స్.. అల్లు అరవింద్ నైస్ డెసిషన్

టాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజై సువర్ హిట్ గా నిలిచిన సినిమా బేబీ(Baby). చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.55 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 

దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya), విరాజ్ అశ్విన్(Viraj ashwin) ప్రధాన పాత్రల్లో నటించారు. ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ రొజురొజుకి పెరుగుతున్నాయి. సినిమా క్లైమాక్స్ లో చాలా మంది  కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చాలా ఎమోషనల్ గా సాగిన క్లామాక్స్ కు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. అయితే బేబీ సినిమాకు క్లైమాక్స్ అంతా బాగా సెట్ అవడం వెనుక చాలా కథనే ఉంది.

ఆ క్లైమాక్స్ అంతబాగా రావడానికి నిర్మాత అల్లు అరవింద్(Allu aravind) కారణమట. ముందుగా ఈ సినిమాకు రెండు క్లైమాక్స్ లను అనుకున్నాడట దర్శకుడు సాయి రాజేష్. అందులో ఒకటి సాడ్ క్లైమాక్స్. అంటే హీరో గానీ, హీరోయిన్ గానీ చనిపోతారు. రెండోవది ఇప్పుడు సినిమాలో ఉన్నాది. మొదటిది అయితే రెగ్యులర్ సినిమాలాగే అవుతుంది కదా అని రెండవదాన్ని ప్రిఫర్ చేశారట నిర్మాత అల్లు అరవింద్. కాకపోతే ఆనంద్ దేవరకొండ పిచ్చివాడిలా మిగిలిపోవడం ఒక్కటే కాకుండా.. వైష్ణవి పెళ్లిని కూడా చూపించాలని సూచించాడట. అదే ఇప్పుడు బేబీ సినిమా క్లైమాక్స్ లో మెయిన్ హైలెట్ గా నిలిచింది. అలా బేబీ సినిమాకు ఎమోషనల్ క్లైమాక్స్ ను సెట్ చేయడంలో నిర్మాత అల్లు అరవింద్ ప్రధాన పాత్ర పోషించారట. ఇక నెటిజన్స్ కూడా బేబీ సినిమా క్లైమాక్స్ అలా కాకుండా వేరే ఎలా ఉన్నా.. ఈ రేంజ్ హిట్ అయ్యుండేది కాదు అని కామెంట్స్ పెడుతున్నారు.