టెడ్డీ బియర్తో మెగా హీరో.. బడ్డీ గ్లింప్స్ సూపర్

టెడ్డీ బియర్తో మెగా హీరో.. బడ్డీ గ్లింప్స్ సూపర్

మెగాహీరో అల్లు శిరీష్ మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". తమిళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ  గ్లింప్స్ చూడటానికి చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఒక టెడ్డీ బియర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపిస్తుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.

ఇక అల్లు శిరీష్ తన బడ్డీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత  జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=o1yz_rUkdeI