ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి భారీ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'AA22 x A6' (వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. 'జవాన్' ఫేమ్ అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్న కొంచె సమయం దొరికితే చాలు తన ఫ్యామిలీతో గడుతుంటారు బన్నీ. అటు ఆయన భార్య స్నేహారెడ్డి నిత్యం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన అంశాలను పోస్ట్ చేస్తూ.. అభిమానులతో టచ్ లో ఉంటారు.
భావోద్వేగ పోస్ట్..
అయితే లేటెస్ట్ గా స్నేహారెడ్డి తన భర్తపై ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "నా భర్త అంటే నాకెంతో ఇష్టం... ఆయన అత్యంత గొప్పవారు. నేను నిజంగా ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన నా జీవితంలో ఉండటం నా అదృష్టం. ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిని నేను. నా జీవితంలో జరిగిన అత్యుత్తమ విషయం ఆయనే. ప్రతి జన్మలోనూ ఆయన నా భర్తగానే ఉండాలని కోరుకుంటున్నాను." – ఇట్లు, అల్లు స్నేహారెడ్డి అంటూ పోస్ట్ చేసింది.
అల్లు అర్జున్ లక్కీ ఫెలో..
ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఈ జంటను 'రిలేషన్ షిప్ గోల్స్' అంటూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో ఆమెకున్న అద్భుతమైన కెమిస్ట్రీ, అన్యోన్యతను చూసి మురిసిపోతున్నారు. "ఈ అమ్మాయి ప్రతి అమ్మాయిని అసూయపడేలా చేసింది, కానీ ఆమెను ద్వేషించడం అసాధ్యం. ఆమె చాలా ముద్దుగా ఉంది. అల్లు అర్జున్, నువ్వు నిజంగా లక్కీ ఫెలో, అని ఒక అభిమానులు కొనియాడుతున్నారు. ఈ భావోద్వేగ సందేశం అల్లు అర్జున్ పట్ల ఆమెకున్న నిజమైన అనుబంధాన్ని, అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని అభినందిస్తున్నారు.
స్టార్ డమ్ పక్కన పెట్టి...
అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం మార్చి 6, 2011న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ జంటకు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. అల్లు అర్జున్ ఎంతటి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినా, స్నేహారెడ్డి ఆయనను కేవలం ఒక సినీ హీరోగా కాకుండా, తనకు జీవితాంతం తోడుండే భాగస్వామిగా చూడటం ఈ పోస్ట్ ద్వారా స్పష్టమైందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్లో వరుస విజయాలతో ఎంతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 'పుష్ప 2: ది రూల్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్-ఫిక్షన్ చిత్రమైన 'AA22 x A6' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెరపై అల్లు అర్జున్ చూపించే ప్రభావం ఎంత బలంగా ఉంటుందో, నిజ జీవితంలో స్నేహారెడ్డితో ఆయన అనుబంధం కూడా అంతే బలంగా, అన్యోన్యంగా ఉంది. ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుతూనే, సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయడం ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తుందంటున్నారు అభిమానులు.
