
కలబంద ముఖ సౌందర్యాన్ని పెంచడంలోనే కాదు , శరీర బరువు తగ్గించటంలో కూడా కలబంద ముఖ్య పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీలో ఒక స్పూన్ కలబంద జ్యూస్ కలుపుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే గ్రీన్ టీలో కలబంద రసం, తేనె, నిమ్మరసం కలుపుకుని రోజూ పరగడుపున ఒక కప్పు, పడుకోవడానికి గంట ముందు ఒక కప్పు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇతర పదార్థాలేవీ కలపడానికి ఇష్టం లేకపోతే రోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిలో రెండు స్పూన్ల కలబంద జ్యూస్ కలుపుకుని తాగొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్దిరోజుల్లోనే శరీర బరువులో మార్పు వస్తుంది. అలాగే ఏదైనా ఫ్రూట్ జ్యూస్లో కలిపి కూడా కలబంద జ్యూస్ తాగొచ్చు. కావాలంటే అచ్చంగా కలబంద రసాన్ని కూడా తీసుకోవచ్చు.