హైదరాబాద్, వెలుగు: మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు గురువారం హైకోర్టులో చుక్కెదురైంది. అమన్ ప్రీత్ సింగ్‌పై హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో జరుగుతున్న దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
ఒకవేళ అరెస్ట్ చేస్తే తక్షణం బెయిలు మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను అంగీకరించలేదు. మాదక ద్రవ్యాల కేసును కొట్టివేయాలని కోరుతూ అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గురువారం దీనిని హైకోర్టు విచారించింది.
