Amar Singh Chamkila: దేశాన్ని ఊపేసిన చమ్కీలా బయోపిక్.. OTTకి వచ్చేస్తోంది

Amar Singh Chamkila: దేశాన్ని ఊపేసిన చమ్కీలా బయోపిక్.. OTTకి వచ్చేస్తోంది

అమర్ సింగ్ చమ్కీల(Amar Singh Chamkila).. ఈ పేరుకి భారత సంగీత ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తన విప్లవ గీతాలతో జనాలను చైతన్య పరుస్తూ.. దేశాన్ని ఒక ఊపు ఊపేశాడు చమ్కీల. సమాజాంలో అంతరాలకు కారణమయ్యే మత సంఘర్షణలు, మద్యపానం, వివాహేతర సంబంధాలు, వరకట్నాలు, మాదకద్రవ్యాలు వంటి వాటిపై ఎన్నో సంచలన పాటలు పాడుతూ, దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చాడు. అలాంటి చమ్కీల జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అదే అమర్ సింగ్ చమ్కీల. ఇంతియాజ్ ఆలీ(Imtiaz Ali) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డిల్జిత్ దోసంజ్(Diljit Dosanjh), పరిణితి చోప్రా(Parineeti Chopra) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

ALSO READ :- అలర్ట్.. హైదరాబాద్లో మండిపోనున్న ఎండలు

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా డైరెక్ట్ ఓటీటీలో. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక చమ్కీల విషయానికి వస్తే.. తన విప్లవ పాటలతో దేశాన్ని ఊపేసిన చమ్కీల పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలోని చమార్ వర్గంలో 1960 జూలై 21న జన్మించాడు. చమ్కీల అసలు పేరు ధనీరామ్‌.. సంగీతం ప్రపంచంలోకి అడుగుపెట్టాక చమ్కీల గా పేరు మార్చుకున్నాడు. 

చిన్నతనంలో ఆర్ధిక సమస్యల వల్ల చిన్న బట్టలకొట్టులో పనిచేసిన చమ్కీల.. ఆ తరువాత ప్రభుత్వాలను సైతం గడగడలాడించిన గాయకుడిగా ఎదిగాడు. అలా ఒక రోజు ప్రదర్శన ఇవ్వడానికి కారులో వెళుతున్న సమయంలో కొందరు అడ్డగించి.. తుపాకీతో ఆయన గొంతులో కాల్చి చంపేశారు. అయితే ఆయన హత్యకు కారణం.. అప్పటి ఖలిస్తాన్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాయడమే అని చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి జీవిత కథతో వస్తున్న సినిమా కావడంతో చమ్కీల సినిమాపై ఆసక్తి పెరిగింది, మరి ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.