కోహ్లీని మించిన మొనగాళ్లు లేరు..

కోహ్లీని మించిన మొనగాళ్లు లేరు..

కరాచీసమకాలీన క్రికెట్​లో టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీని మించిన మొనగాళ్లు లేరని పాకిస్థాన్​ మాజీ బ్యాట్స్​మన్​ అమీర్​ సోహైల్​ ప్రశంసలు కురిపించాడు. టీమ్​మేట్స్​లో స్ఫూర్తి నింపడంలో అతనికి ఎవరూ సాటిరారన్నాడు. తమ లెజెండరీ బ్యాట్స్​మన్​ జావేద్​ మియాందాద్​తో కోహ్లీకి చాలా పోలికలు ఉన్నాయన్నాడు. ‘ప్రస్తుత తరంలో కోహ్లీ గ్రేట్​ ప్లేయర్​. అతడి చుట్టూ ఉండే ప్లేయర్లలో చాలా స్ఫూర్తి నింపుతాడు. గొప్ప క్రికెటర్లలో ఉండే గొప్పతనం ఇదే. లెజెండరీ క్రికెటర్​గా మారాలంటే ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉండాలి. క్రికెట్​లో పేరుమోసిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వ్యక్తిగతంగానూ గొప్ప ప్లేయర్లు చాలానే ఉన్నారు. కానీ వారి గొప్పతనం మాత్రం టీమ్​కు ఉపయోగపడలేదు. ఓవరాల్​గా వాళ్ల పెర్ఫామెన్స్​ టీమ్​కంటే వాళ్లకే ఎక్కువగా ఉపయోగపడింది. మా క్రికెట్​ చరిత్రలో గొప్ప ప్లేయర్​ మియాందాద్​. తన చుట్టు ఉండే ప్లేయర్ల స్థాయి మెరుగవ్వడానికి చాలా కృషి చేశాడు. అందుకే ఈ రోజుల్లో కూడా అతని పేరును గుర్తు చేసుకుంటున్నాం. అతనితో కలిసి ఎక్కువ కాలం పని చేస్తే చాలా నేర్చుకోవచ్చు. మనం కూడా మెరుగవ్వాలనే స్ఫూర్తి కలుగుతుంది. కోహ్లీ కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. తనతో పాటు చుట్టూ ఉండే టీమ్​మేట్స్​ను కూడా మెరుగుపరుస్తాడు. అందుకే అతనికి గ్రేట్​ ప్లేయర్​ అనే ట్యాగ్​ వచ్చింది’ అని సోహైల్​ పేర్కొన్నాడు. కోహ్లీ గ్రేట్​ ప్లేయర్​ అని చెప్పడానికి చాలా కారణాలున్నాయన్నాడు. బ్యాటింగ్ తీరు, దూకుడు, మైదానంలో ప్రవర్తన విరాట్​ను ఉన్నత స్థానంలో నిలబెట్టాయన్నాడు. ప్రొఫెషనల్​ కెరీర్​కు, పర్సనల్​ లైఫ్​కు సేమ్​ ఇంపార్టెన్స్​ ఇస్తాడని కితాబిచ్చాడు.

బాబర్​ చాలా నేర్చుకోవాలి

క్రికెట్​లో కోహ్లీలా ఎదగాలంటే పాక్​ కెప్టెన్​ బాబర్​ ఆజమ్​ చాలా నేర్చుకోవాలని సోహైల్​ అన్నాడు. ‘బాబర్​లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. టాలెంట్​ బాగానే ఉంది. బాగా ఆడాలనే తపన, ఆసక్తి కూడా ఎక్కువే. కానీ టీమ్​మేట్స్​తో ఉండాల్సిన తీరులో చాలా మార్పులు రావాలి. వాళ్లకు అవసరమైనప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలి. తనను చూసి స్ఫూర్తి పొందేలా కొన్ని విషయాల్లో ముందుండాలి. మాకు ఒకడున్నాడనే నమ్మకం వాళ్లలో కలిగించాలి. అందుకు అతను బాగా కష్టపడాలి.’ అని సోహైల్​ సలహాలు ఇచ్చాడు. టీమిండియా డ్రెస్సింగ్​ రూమ్​లో ఉండే వాతావరణం పాక్​ క్రికెట్​లోనూ ఉంటే బాగుంటుందన్నాడు. దీనిని నెలకొల్పడానికి బాబర్​ కృషి చేయాలని సోహైల్​ పేర్కొన్నాడు.

ఎయిర్ పోర్ట్ పక్కన 74 రోజులు..చనిపోయాడనుకున్నారు