ఎంట్రప్రెనూర్లకు.. అమర రాజా గ్రూప్ అవార్డులు

ఎంట్రప్రెనూర్లకు.. అమర రాజా గ్రూప్ అవార్డులు

హైదరాబాద్​, వెలుగు: అమర రాజా గ్రూప్ తన వార్షిక బెటర్ వే అవార్డుల విజేతలను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలు కల్పిస్తున్న సంస్థలను హైదరాబాద్​లో సత్కరించింది. 

గ్రామీణ ఆదాయ కల్పన విభాగంలో అనూత్తమ ప్రొడక్ట్స్, ఉత్తమ అగ్రి బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలాగ్రి సర్వీసెస్ అవార్డులు గెలుచుకున్నాయి. మహిళా ఉపాధి విభాగంలో అరటి నారతో సానిటరీ ప్యాడ్లు తయారు చేస్తున్న సౌఖ్యం ఫౌండేషన్ విజేతగా నిలిచింది. 

విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతితో పాటు ఏడాది పాటు ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ రంగాల్లో మార్గదర్శకత్వం అందిస్తారు. అమర రాజా గ్రూప్ చైర్మన్ జయదేవ్ గల్లా సమక్షంలో ఈ వేడుక జరిగిందని కంపెనీ ప్రకటించింది.