పంజాబ్ లో బీజేపీతో కెప్టెన్ అమరేందర్ సింగ్ పొత్తు ఖరారు

పంజాబ్ లో బీజేపీతో  కెప్టెన్ అమరేందర్ సింగ్ పొత్తు ఖరారు

రాబోయే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఖరారైందన్నారు  మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్. కేంద్రమంత్రి, బీజేపీ పంజాబ్ ఇన్ ఛార్జ్ గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయిన అమరేందర్ సింగ్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పంజాబ్ ఎన్నికల్లో 101 శాతం తమ కూటమిదే గెలుపన్నారు. ఏడు రౌండ్ల చర్చల తర్వాత బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పొత్తు కుదిరిందన్నారు గజేంద్ర షెకావత్. సీట్ల పంపకాలపై చర్చలు జరగాల్సి ఉందన్నారు. గెలుపు అవకాశాలను బట్టి నియోజకవర్గాలను పంచుకుంటామన్నారు.