ఆగస్టు 5న అమర్‌నాథ్‌ యాత్ర రద్దు..కారణం ఇదే

ఆగస్టు 5న అమర్‌నాథ్‌ యాత్ర రద్దు..కారణం ఇదే

అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 2023 ఆగస్టు 5న  ఈ యాత్రను రద్దు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.  ఆర్టికల్ 370 , 35A రద్దు చేసి ఆగస్టు 5కు నాలుగేళ్లు పూర్తయిన క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ యాత్రను రద్దు చేసినట్లుగా ప్రకటించారు.  ఆర్టికల్ 370 , 35A రద్దు నాలుగో  వార్షికోత్సవం సందర్భంగా  వివిధ గూఢచార సంస్థల నుండి అందిన భద్రతా ఇన్‌పుట్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. 

శుక్రవారం జమ్మూలోని బేస్‌క్యాంప్‌ నుంచి  1,181 మంది యాత్రికులు  33వ బ్యాచ్‌ బయల్దేరి దక్షిణ హిమాలయాల్లోని అమర్‌నాథ్‌ క్షేత్రానికి భారీ భద్రత మధ్య వెళ్లినట్టు అధికారులు తెలిపారు. జులై 1 నుంచి కొనసాగుతోన్న ఈ యాత్రలో ఇప్పటివరకు 4.5లక్షల మందికి పైగా భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకున్నారని వెల్లడించారు. అమర్‌నాథ్‌  ఆగస్టు 31న ముగుస్తుంది.