ఇక నుంచి తెలుగులోనూ అమెజాన్

ఇక నుంచి తెలుగులోనూ అమెజాన్

న్యూఢిల్లీ: అమెజాన్‌ యాప్‌‌ను తెలుగు భాషలో వాడొచ్చు. ఈ యాప్‌‌‌‌కు అదనంగా తెలుగు, కన్నడ, మళయాళం, తమిళ్ భాషలను అమెజాన్‌ ఇండియా యాడ్‌‌‌‌ చేసింది. ఈ భాషలు డెస్క్‌‌‌‌ టాప్ వెర్షన్‌ లో కూడా అందుబాటులో ఉన్నాయి. గతంలో కస్టమర్లకు కేవలం హింది, ఇంగ్లిష్‌ భాషలలోనే అమెజాన్‌లో షాపింగ్ చేయడానికి వీలుండేది. కొత్తగా నాలుగు భాషలను యాడ్‌‌‌‌ చేయడంతో 20–30 కోట్ల మందికి ఆన్‌ లైన్ షాపింగ్‌ ఎక్స్‌ పీరియెన్స్‌ మెరుగువుతుందని కంపెనీ పేర్కొంది. కస్టమర్లకు తమకు కావాల్సిన భాషను సింపుల్‌ స్టెప్‌‌‌‌లలోనే ఎంచుకోవచ్చని తెలిపింది. కంపెనీ 2018 లో హింది భాషను అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ కూడా ఈ ఏడాది తన యాప్‌‌‌‌లో తెలుగు, తమిళ్‌‌‌‌, కన్నడ భాషలను యాడ్‌‌‌‌ చేసింది.