ఇకపై చంద్రుడిపై కూడా అమేజాన్ సర్వీసులు

ఇకపై చంద్రుడిపై కూడా అమేజాన్ సర్వీసులు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అద్భుతమైన ప్రకటన చేసింది. ఇక నుంచి చంద్రుడిపైకి కూడా డెలివరీ పంపించనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏ ప్రాంతానికైనా 2 నుంచి 3 రోజుల్లో వస్తువుల డెలివరీ అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం పొందింది అమెజాన్. కొన్ని ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా కూడా డెలివరీ చేస్తున్నారు. పైగా ఇందులో అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది వినియోగదారులు అమెజాన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇందులో భాగంగానే అమెజాన్ వ్యవస్థాపకుడు కమ్ సీఈవో జెఫ్ బెజోస్‌ సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. గురువారం వైభవంగా వాషింగ్టన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్లూ మూన్ లూనార్ లాండర్ వెహికిల్ ను ఆవిష్కరించారు. యాపిల్ ఐఫోన్ లాంచింగ్ కార్యక్రమం తరహాలో ఈ బ్లూమూన్ ప్రాజెక్టును ప్రకటించింది.  బ్లూ మూన్ ప్రాజెక్టు పేరిట చంద్రమండలం మీదకు రానున్న 5 సంవత్సరాల్లో మనుషులను పంపే టూరిజం బిజినెస్ కోసం లూనార్ లాండర్ ను తయారు చేసింది. అమెజాన్ సంస్థకు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ స్పేస్ రీసెర్చ్ సంస్థగా ప్రయోగాలు చేపడుతోంది. అదే సంస్థ నుంచి ఈ బ్లూ మూన్ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే బ్లూ ఆరిజన్ నుంచి వచ్చిన లూనార్ లాండర్ ఒక చిన్న సైజు ఇల్లు తరహాలో ఉంది. అంతేకాదు, మొత్తం నాలుగు రోవర్లతో పాటు కొత్తగా డిజైన్ చేసిన రాకెట్ ఇంజిన్లు దీనికి అనుసంధానించబడి ఉంటాయి. ఈ రోవర్ సహాయంతో చంద్రుడిపై సేఫ్ గా  ల్యాండ్ అవడంతో పాటు, నివాసం ఉండేందుకు సరిపడా చోటు ఉంది. అంతే కాదు, రానున్న కొద్ది సంవత్సరాల్లో చంద్రమండలంపై భారీ ప్రాజెక్టులు కూడా నిర్మిస్తామని అమెజాన్ తెలిపింది. అంతేకాదు

2024 నాటికి మానవ సహిత రోవర్ ను చంద్రుడి మీదకు పంపడమే తమ లక్ష్యమని నాసా కూ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉందని తెలిపారు. అలాగే ఇదే ప్రాజెక్టులో పనిచేస్తున్న రాబర్ట్ వాకర్ అనే స్పేస్ కన్సల్టెంట్ ముందుగా 2023 నాటికి మనుషులు లేని రోవర్ ను ప్రయోగాత్మకంగా చంద్రుడి మీదకు పంపుతామని తెలిపారు.