అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ వాదులు, రాజకీయ ప్రముఖులు అంబేద్కర్ విగరహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు జెండాలతో పాటు వచ్చి హల్ చల్ చేశారు ఏబీవీపీ కార్యకర్తలు.
ఉత్సవ కమిటీ నేతలు జెండాలు పక్కనపెట్టి అంబేద్కర్ విగ్రహానికి మాలవేయాలని కోరగా... వినకుండా జండాలతో పాటు పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు ఏబీవీపీ నాయకులు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దళిత సంఘాల నేతలు, అంబేద్కర్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఏవీవీపీ కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. పోలీసుల తీరు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏబీవీపీ నేతలు.
ఇదిలా ఉండగా...మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు అంబేద్కర్ సంఘం నేతలు,విద్యావంతులు.ఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేశారు.అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆవిష్కరణ చేయనున్న విగ్రహం కావడం తో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

