- ఈ పాస్ పోర్టల్లో దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ( ఏవోవిఎన్ ) స్కీమ్ కు 2024–25 అకడమిక్ ఇయర్ కు రిజిస్ర్టేషన్లు బుధవారం నుంచి స్టార్ట్ అయ్యాయి. అర్హులైన స్టూడెంట్స్ వచ్చే నెల 13 వరకు ఈ పాస్ పోర్టల్ లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని ఎస్సీ డెవలప్ మెంట్ కమిషనర్ టీకే. శ్రీదేవి, అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి పత్రిక ప్రకటనలో తెలిపారు.
విదేశాల్లో ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నత చదువులు చదివేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రూ. 20 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నది. ప్రతి ఏటా రెండు సార్లు జనవరి, ఆగస్టులో రిజిస్ట్రేషన్లను ఓపెన్ చేస్తోంది. ఈ స్కీమ్ కింద 211 మందిని ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందజేయనున్న ట్టు అధికారులు తెలిపారు.
