బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల(సీవోఈ) స్కూల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదివి అంబేద్కర్ మాదిరిగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ ఎ.విజయసాగర్, వైస్ ప్రిన్సిపాల్ టి.గోపి, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, కార్యదర్శి రాజేశం పాల్గొన్నారు.
