నస్పూర్: మట్టి గణపతులు పంపిణీ

నస్పూర్: మట్టి గణపతులు పంపిణీ

నస్పూర్, వెలుగు: వినాయకచవితి సందర్భంగా శ్రీరాంపూర్  జీఎం ఆఫీస్​లో విత్తన మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కట్టుబడి ఉందన్నారు. నీటి కాలుష్యం నివారణలో భాగంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గణపతి విగ్రహంలో ఒక విత్తనం ఉంటుందని, వినాయకచవితి తర్వాత ఇంటి ఆవరణలో నిమజ్జనం చేస్తే మొక్కగా తయారవుతుందని చెప్పారు. 

ఒక్కో గణపతి ఒక చెట్టులా ఎదగాలని ఆకాంక్షించారు. సింగరేణి సంస్థ ద్వారా అన్ని ఏరియాల్లో వేలాది మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఏఐటీయుసీ నాయకులు బాజీ సైదా, డీజీఎం(పర్సనల్) ఎస్.అనిల్  కుమార్, సీఎంవోఐ ప్రతినిధి పద్మ,  ఎన్విరాన్​మెంట్​ ఆఫీసర్  మురళి, లా ఆఫీసర్  మల్లేశ్  పాల్గొన్నారు.