మే 31 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్

మే 31 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు : బీఆర్​అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2016 తో పాటు అంతకు ముందు డిగ్రీ బ్యాచుల స్టూడెంట్లకు మే 31 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ ఎగ్జామ్స్ కంట్రోలర్ పి.వెంకటరమణ తాజాగా ఒక ప్రకటన చేశారు. థర్డియర్ స్టూడెంట్లకు మే 31 నుంచి జూన్ 5 వరకు, సెకండియర్ స్టూడెంట్లకు జూన్ 7 నుంచి 14 వరకు, ఫస్టియర్ స్టూడెంట్లకు జూన్ 16 నుంచి 19 వరకు ఎగ్జామ్స్  నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు మే 10 లోపు ఆన్​లైన్​లో రిజిస్ర్టేషన్  చేసుకోవాలని వెంకటరమణ సూచించారు.