అంబేద్కర్ వర్థంతి : ప్రముఖుల నివాళులు

అంబేద్కర్ వర్థంతి : ప్రముఖుల నివాళులు

మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి నేపథ్యంలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్‌లో ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ కర్, స్పీకర్ ఓం బిర్లా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.

మన దేశానికి ఆయన చేసిన ఆదర్శప్రాయమైన సేవను స్మరించుకుంటున్నానని, అంబేద్కర్ పోరాటం వల్ల లక్షలాది మందిలో ఆశ చిగురించాయని ప్రధాని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని కొనియాడారు. మనందరం సమానమని, మనందరం భారతీయులమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వీటన్నింటికీ విరుద్దమైన వాటిని బాబాసాహెబ్ ఆమోదించరని, ఆయన బాటలో నడిచే మనకు కూడా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కు నివాళి అర్పిస్తూ పోస్ట్ చేశారు.