- ఇంకా దొరకని కిడ్నాపర్లు.. గాలిస్తున్న పోలీసులు
అంబర్‌పేట, వెలుగు: అంబర్పేటలో రెండు రోజుల కింద కిడ్నాప్‌కు గురైన రియల్టర్ శ్యామ్ ఆచూకీ ఎల్బీనగర్లో లభ్యమైంది. కిడ్నాపర్ల ఆచూకీ ఇంకా లభించకపోవడంతో పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు. బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీలోని కృష్ణతేజ్ రెసిడెన్సీలో ప్లాట్ నం. 401లో నివసించే శ్యామ్అక్టోబర్ 29న కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆయన రెండో భార్య ఫాతిమా ఫిర్యాదుతో అంబర్‌పేట పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
కిడ్నాప్‌కోసం వాడిన కారును నిందితులు కాచిగూడలో బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. శ్యామ్ మొదటి భార్య మాధవీ లతను పిలిపించి విచారణ చేశారు. అయినా ఆచూకీ లభించలేదు. బంజారాహిల్స్ లోని ఓ బ్యాంకులో శ్యామ్ శుక్రవారం మధ్యాహ్నం డబ్బులు డ్రా చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. అయినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో శనివారం శ్యామ్ఎల్బీనగర్లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడి వెళ్లి తీసుకొచ్చారు.
అయితే, కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకోసం చేశారు? ఆర్థిక లావాదేవీలే కారణమా? అతనిపై ఉన్న కేసులు కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్యామ్ చేసుకున్న వివాహాలపై ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
