ఆడవాళ్ల కోసం స్పెషల్ అంబులెన్స్​

ఆడవాళ్ల కోసం స్పెషల్ అంబులెన్స్​

అంబులెన్స్​ డ్రైవర్లుగా మగవాళ్లే  ఎక్కువగా కనిపిస్తారు. కానీ, పుణేలో ‘నైన్​బీ’ అనే సంస్థ విమెన్ అంబులెన్స్​ సర్వీసెస్​ అందిస్తోంది. ఇంతకీ ఈ అంబులెన్స్​లు ఎందుకు స్టార్ట్​ చేశారో తెలుసా...

‘స్త్రీ సేఫ్’ పేరుతో ‘నైన్​ బీ’ అనే సంస్థ​ పుణేలో  ​మూడు వారాల కిందట ఆడవాళ్ల అంబులెన్స్​ సర్వీసెస్​ మొదలుపెట్టింది. తమ వాళ్లను అంబులెన్స్​లో తీసుకెళుతున్న ఒంటరి ఆడవాళ్లతో అంబులెన్స్​ సిబ్బంది రూడ్​గా బిహేవ్ ​ చేస్తున్నారని ‘నైన్​ బీ’ అనే సంస్థకు కొందరు చెప్పారట. వెంటనే ఆ సంస్థ ఆడవాళ్ల కోసం ఫ్రీగా అంబులెన్స్​ సేవలను స్టార్ట్​ చేసింది.ఆడవాళ్లు నడిపే ఈ అంబులెన్స్​ మీద పింక్​ లెటర్స్​లో ‘బై విమెన్​, ఫర్​ విమెన్​’ అని రాసుంటుంది. 

కంప్లైంట్స్ రావడంతో...
“మొదట మేము పాత మినీ వ్యాన్ ను అంబులెన్స్​గా వాడాలనుకున్నాం. కానీ లాక్​డౌన్​లో మెడికల్​ క్లియరెన్సులు, ఇతర అనుమతులు కష్టం. అందుకే అంబులెన్స్​గా రిజిస్టర్​ అయిన వాహనాన్నే ఉపయోగిస్తున్నాం’’అని చెబుతారు ‘నైన్​బీ’ సంస్థ ఛైర్​పర్సన్​ అమర్​ప్రీత్​ సింగ్​. ‘స్త్రీ సేఫ్​’ అంబులెన్స్​ సర్వీస్​కు రోజుకు రెండు మూడు కాల్స్​ వస్తున్నాయి. ఇప్పటికైతే ఇద్దరు విమెన్​ డ్రైవర్లు ఉన్నారు. మరో అయిదుగురికి డ్రైవింగ్​లోనే కాకుండా సెల్ఫ్​ డిఫెన్స్, మార్షల్​ ఆర్ట్స్​​లో శిక్షణ ఇస్తున్నారు.

అంతేకాకుండా మరో మూడు అంబులెన్స్​లు కొనేందుకు ఫండ్​ రైజింగ్​ కూడా మొదలెట్టారు ‘నైన్​ బీ’ మెంబర్స్​. తమ అంబులెన్స్​ సేవల గురించి సోషల్​ మీడియా ద్వారా అవేర్​నెస్​ ఇస్తున్నారు కూడా. ‘స్త్రీ సేఫ్​’ సర్వీస్​ ఆడవాళ్లకు ఏ భయం లేకుండా అంబులెన్స్​లో వెళ్లొచ్చనే ధైర్యాన్ని ఇస్తోంది. త్వరలోనే ఢిల్లీలో కూడా ఇలాంటి అంబులెన్స్​నడపాలనే ఆలోచనతో ఉన్నారు ‘నైన్​ బీ’ ఫౌండర్స్.