కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించడంతో అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగింది. కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమని, అది భారత్, పాకిస్తాన్ మధ్య పరిష్కారమయ్యే అంశమని అమెరికా తెలిపింది. కశ్మీర్ గురించి చర్చించేందుకు రెండు దేశాలు ఆసక్తి చూపితే దాన్ని ఆహ్వానిస్తామని అమెరికా సౌత్ అండ్ సెంట్రల్ ఏషియో అఫైర్స్ యాక్టింగ్ అసిస్టెంట్ సెక్రటరీ అలిస్ వెల్స్ ట్విట్టర్ లో వెల్లడించారు. కశ్మీర్ సమస్యలపై ఆ రెండు దేశాలే చర్చించాలన్నారు. కావాలంటే తాము సహకరిస్తామని అలిస్ వెల్స్ తెలిపారు.
