లష్కరే తోయిబా చీఫ్.. మసూద్ అజార్ ను పాకిస్తాన్ అరెస్ట్ చేసిందన్న వార్తపై అమెరికా స్పందించింది. హఫీజ్ సయీద్ అరెస్ట్ కంటితుడుపు చర్యేనని కామెంట్ చేసింది. ఇలాంటివి గతంలోనూ చూశామన్న అమెరికా.. చర్యలు పటిష్టంగా ఉండాలని చెప్పింది. 2001 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు అరెస్ట్ చేసినా.. ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోలేదని అమెరికా అధికారులు చెప్పారు. ఉగ్రవాద సంస్థలపై కఠినచర్యలు తీసుకునేలా పాక్ పై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
