కేజ్రీవాల్ అరెస్ట్​పై అమెరికా స్పందన

కేజ్రీవాల్ అరెస్ట్​పై అమెరికా స్పందన

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్​పై అమెరికా స్పందించింది. ఇండియాలోని ప్రతిపక్ష నేత అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్​కు సంబంధించిన అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది. కేజ్రీవాల్‌‌‌‌ అరెస్టుపై మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి బదులిస్తూ.. ‘‘సమయానుకూల, పారదర్శక న్యాయప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్ట్​పై ఇటీవల జర్మనీ అధికార ప్రతినిధి కూడా స్పందించగా.. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే!