అమెరికాలో వరుస కాల్పులు అక్కడి ప్రజలను హడలెత్తుస్తున్నాయి. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా నార్త్ కరోలినా చాపెల్ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో కాల్పులు కలకలం సృష్టించాయి.
వర్సిటీ క్యాంపస్ లోకి చొరబడిన దుండగుడు.. కాల్పులకు తెగబడ్డాడు. సైన్స్ భవనంలో కాల్పులు జరపడంతో ఫ్రొఫెసర్ జిజీ యాన్ మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని వర్సిటీ చాన్సలర్ కెవిన్ గుస్కివీజ్ చెప్పారు. వర్సిటీలో కాల్పులు చోటుచేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే కాల్పుల ఘటనతో యూనివర్శిటీకి లాక్ డౌన్ ప్రకటించారు.
