పాకిస్థాన్ కు అమెరికా మరోసారి వార్నింగ్

పాకిస్థాన్ కు అమెరికా మరోసారి వార్నింగ్

పాకిస్థాన్ కు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని ఆదేశించింది. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయకుంటే పాకిస్తాన్ కే నష్టం జరుగుతుందని హితవు పలికింది. ఉగ్రవాదంపై తీరు మార్చుకోవాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సూచించింది అగ్రరాజ్యం. భారత్ పై కవ్వింపు చర్యలకు దిగొద్దని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీతో మాట్లాడిన అమెరికా విదేశాంగ సెక్రటరీ మైకో పోంపో.. సరిహద్దుతో ఉద్రిక్తత తగ్గించాలని సూచించారు.