బాబోయ్ రాకాసి గాలి... డల్లాస్ లో కొట్టుకుపోయింది..

బాబోయ్ రాకాసి గాలి... డల్లాస్ లో  కొట్టుకుపోయింది..

యునైటెడ్ స్టేట్స్‌లోని డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్‌ పోర్టులో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. గాలివాన భీభత్సానికి ఎయిర్‌పోర్టు రన్‌వేపై నిలిపిన విమానం కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 90 వేల పౌండ్ల బరువున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ విమానం మంగళవారం ( మే 28)  వీసిన బలమైన గాలుల ధాటికి పక్కకు కొట్టుకుపోయింది. 

సాధారణంగా బలమైన గాలి వాన బీభత్సానికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం.. కార్లు, బైక్‌లు వంటి వాహనాలు వరదలకు కొట్టుకుపోవడం వంటివి చూస్తుంటాం. కానీ అంత బరువున్న విమానం కొట్టుకుపోవడం ఏంటబ్బా అని ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం..

అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం ( మే 28)  భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విమాన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ ఎయిర్‌పోర్ట్‌లోని సుమారు 700 విమానాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అక్కడ బలమైన గాలుల ధాటికి రన్‌వేపై పార్క్‌ చేసిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-800 విమానం ఒక్కసారిగా పక్కకు తోసుకుంటూ వెళ్లింది. విమానాశ్రయంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఇది రికార్డ్ అయింది. . ఆ సమయంలో దాదాపు గంటకు 80 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఈ దెబ్బకు దాదాపు 202 విమానాలను రద్దు చేయగా.. మరో 500 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. D-FW విమానాశ్రయం నుంచి బయలుదేరవల్సిన పలు విమానాలు రద్దు చేశారు. టెక్సాస్ లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆరు లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. టెక్సాస్ లో ఇటీవల కురిసిన తీవ్రమైన తుఫానుల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దీని నుంచి కోలుకుంటున్న క్రమంలో తాజాగా మరొక తుఫాను భీభత్సం సృష్టించింది.

Also read :  ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

 మే 28న వీచిన గాలి తాకిడికి  డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ ఎయిర్‌పోర్ట్‌లో పార్కింగ్‌లో ఉన్న ఓ బోయింగ్‌ విమానం చక్రం తిరిగినట్టుగా తిరిగిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.  విమానాన్ని పరిశీలిస్తున్నామని, అవసరమైన మరమ్మత్తులు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

పంచభూతాలు మనిషికి ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదం కూడా. మనిషికి భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి చాలా అవసరం. ఇవి ఉంటునే మనుగడ ఉంటుంది. ఇవి మనిషి జీవనాన్ని శాసిస్తాయి. గాలి కావల్సినంత ఉంటేనే క్షేమం. లేదంటే మనిషి ప్రాణాలను కూడా తీస్తుందని  అమెరికాలో జరిగిన సంఘటన అద్దంపడుతోంది.