మోదీ ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డిన అమెరికా సెనేట‌ర్లు

మోదీ ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డిన అమెరికా సెనేట‌ర్లు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. యుఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత వైట్ హౌస్ విందుకు హాజరయ్యారు. రెండో రోజు కూడా ఆయన బిజీబిజీగా గడిపారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు తీసుకోవడానికి కాంగ్రెస్ సభ్యులు బారులు తీరారు. ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ సంయుక్త సెషన్ చిరునామా బుక్‌లెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆటోగ్రాఫ్ చేసే వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంపైప్రధాని ట్వీట్ చేశారు. "యుఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించడం గౌరవంగా ఉంది. ఈ రోజు హాజరైన కాంగ్రెస్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. మీ ఉనికి భారతదేశం-యుఎస్ఎ సంబంధాల బలాన్ని, మెరుగైన భవిష్యత్తు కోసం మా భాగస్వామ్య నిబద్ధతను సూచిస్తుంది. ప్రపంచ శాంతి, పురోగతిని పెంపొందించడంలో నిరంతర భాగస్వామ్యం కోసం నేను ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రధాన మంత్రి, తన ప్రసంగం తర్వాత వైట్ హౌస్‌లో US అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ తో కలిసి రాష్ట్ర విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://twitter.com/ANI/status/1672069662379749379