బలూచిస్తాన్​కు అస్సలు వెళ్లొద్దు

బలూచిస్తాన్​కు అస్సలు వెళ్లొద్దు
  • పాక్​ వెళ్తున్నారా..మళ్లీ ఆలోచించుకోండి
  • బలూచిస్తాన్​కు అస్సలు వెళ్లొద్దు..
  • అమెరికా సిటిజన్లకు ఆ దేశం అలర్ట్‌‌‌‌

వాషింగ్టన్‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌లోని చాలా ప్రావిన్సుల్లో టెర్రరిజం, మతపరమైన హింస ఎక్కువగా ఉందని పేర్కొంటూ ఆ దేశానికి పోవాలనుకునేటోళ్లు మరోసారి ఆలోచించుకోవాలని అమెరికా తన సిటిజన్లను హెచ్చరించింది. బలూచిస్తాన్‌‌‌‌, ఖైబర్‌‌‌‌‌‌‌‌ పఖ్తున్‌‌‌‌ ఖ్వా(కేపీకే) ప్రావిన్సులతో పాటు ఫెడరల్‌‌‌‌ అడ్మినిస్ట్రెడ్‌‌‌‌ ట్రైబల్‌‌‌‌ ఏరియాస్‌‌‌‌(ఎఫ్‌‌‌‌ఏటీఏ)లకు ప్రయాణం చేయొద్దని, అక్కడ టెర్రరిజం, కిడ్నాపులు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రావెల్‌‌‌‌ అడ్వైజరీలో అమెరికా వెల్లడించింది. పాక్‌‌‌‌లోని కొన్ని ఏరియాల్లో రిస్క్‌‌‌‌ ఎక్కువగా ఉందని పేర్కొంటూ లెవల్‌‌‌‌ 3 ట్రావెల్‌‌‌‌ వార్నింగ్‌‌‌‌ జారీ చేసింది.

ఎల్‌‌‌‌వోసీ దగ్గరలో ప్రయాణించకూడదని అమెరికన్లకు సూచించింది. పాక్‌‌‌‌లో టెర్రరిస్ట్‌‌‌‌ గ్రూపులు దాడులకు కుట్ర చేస్తున్నాయని, వాటిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆర్మీ, పోలీసులపై దాడులకు పాల్పడుతున్నాయని చెప్పింది. ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ హబ్స్‌‌‌‌, మార్కెట్లు, మాల్స్‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులు, వర్సిటీలు, టూరిజం సెంటర్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు, ప్రార్థనా మందిరాలపై టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారని పేర్కొంది.