కులం పేరుతో వేధించారంటూ.. ఇస్లాంలోకి 8 ఫ్యామిలీలు

కులం పేరుతో వేధించారంటూ.. ఇస్లాంలోకి 8 ఫ్యామిలీలు
  • తమిళనాడులోని థేనిలో ఘటన 

చెన్నై: కులం పేరుతో వేధించారని ఆరోపిస్తూ తమిళనాడులోని థేనిలో 8 దళిత కుటుంబాలు ఇస్లాం మతంలోకి మారాయి. అగ్ర కులాల వేధింపులు తట్టుకోలేకే తాము ముస్లింలుగా మారినట్టు బాధితులు  చెప్తున్నారు. కొత్త బండి ఎందుకు కొనుక్కున్నావని ప్రశ్నిస్తూ గ్రామంలోని పెద్ద కులాల వాళ్లు తన భర్తపై దాడి చేసి గాయపరిచారని రహీమాగా పేరు మార్చుకున్న వీరలక్ష్మి చెప్పారు. చిన్నప్పటి నుంచి కుల వివక్షను ఎదుర్కొన్నానని మహ్మద్ ఇస్మాయిల్‌‌‌‌‌‌‌‌గా పేరు మార్చుకున్న రహీమా భర్త తెలిపారు. కనీసం ఆరు నెలలకు ఒకసారి అగ్ర కులాల వాళ్లు దళిత కుటుంబాలపై దాడులకు పాల్పడతారని, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేస్తారని ముస్తఫాగా పేరు మార్చుకున్న నాగరాజ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. తమలో తాము చర్చించుకుని ఇస్లాంలోకి మారాలని నిర్ణయించుకున్నామని, తమ తాత ముత్తాతలు కూడా అవమానాలు ఎదుర్కొన్నారన్నారు. ఇలాంటి అవమానాలు ఎందుకు ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే కన్వర్ట్ అయ్యామన్నారు.