V6 News

సోమవారం పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..

సోమవారం పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..

బంగారం, వెండి ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా స్థబ్దత వెంటాడుతోంది. దాదాపు రెండు నెలలుగా వీటి ధరలు ఒకే స్థాయిల వద్ద కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు దూరంగా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆభరణాలు కొనటానికి ముందుగా తమ నగరాల్లో తాజా రేట్లను పరిశీలించటం మంచిది. 

ఏప్రిల్27న బంగారం రేట్లు పెరిగాయి. ఏప్రిల్ 26 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.38 పెరిగింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 442గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 155గా కొనసాగుతోంది. 

ALSO READ : బిహార్‌‌‌‌లో 2 ఎన్‌‌టీపీసీ నూక్లియర్ పవర్ ప్లాంట్లు !

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్27, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు ఎలాంటి మార్పు లేకుండా రూ.2లక్షల 70వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము రూ.270గా అమ్మకాలు జరుగుతున్నాయి.