V6 News

బిహార్‌‌‌‌లో 2 ఎన్‌‌టీపీసీ నూక్లియర్ పవర్ ప్లాంట్లు !

బిహార్‌‌‌‌లో 2 ఎన్‌‌టీపీసీ నూక్లియర్ పవర్ ప్లాంట్లు !
  • పెట్టుబడి విలువ రూ.25 వేల కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌‌టీపీసీ రెండు నూక్లియర్ పవర్‌‌‌‌ ప్లాంట్లను బిహార్‌‌లోని బాంకా జిల్లాలో  ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఒక్కొక్కటి 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ల కోసం సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్లాంట్‌‌ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలమో కాదో విశ్లేషిస్తోంది.

పట్నా నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి బిహార్ ప్రభుత్వం నీటి సరఫరా, భూమి వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. ప్రారంభ అంచనాల ప్రకారం, ఈ యూనిట్ల కోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమి అవసరం అవుతుంది.

పరిశ్రమ అంచనాల ప్రకారం, ఒక గిగావాట్‌‌ నూక్లియర్‌‌ పవర్‌‌‌‌‌‌ ప్లాంట్‌‌ కోసం రూ.15 వేల నుంచి 20వేల కోట్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ఇవి అందుబాటులోకి రావడానికి కనీసం మూడేళ్ల టైమ్ పడుతుంది. ఎన్‌టీపీసీ రాజస్థాన్‌‌లో నూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌పీసీఐఎల్‌‌)తో కలిసి రూ.42వేల కోట్ల పెట్టుబడితో మరో నూక్లియర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌ను నిర్మిస్తోంది. కంపెనీ దేశవ్యాప్తంగా 30 గిగావాట్‌‌ నూక్లియర్‌‌‌‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.