హైదరాబాద్, వెలుగు: ఇంజెక్షన్లు, కంటి చుక్కల మందుల్లో వాడే స్టెరైల్ ఏపీఐ తయారీని మరింత పెంచడానికి హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీలు గ్లాండ్ ఫార్మా, న్యూలండ్ ల్యాబ్స్ జత కట్టాయి. దీనికోసం సీడీఎంవో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. విశాఖపట్నంలోని జేఎన్‌పీసీ ప్లాంటులో ప్రత్యేక స్టెరైల్ తయారీ యూనిట్‌ను గ్లాండ్ ఫార్మా ఏర్పాటు చేయనుంది. మైక్రోపార్టికల్ ఉత్పత్తులకు అవసరమైన స్టెరైల్ ఏపీఐల తయారీని పెంచనున్నారు.
ఈ ప్లాంటుతో ఏటా 1,400 కిలోల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. సీజీఎంపీ, యూఎస్‌ఎఫ్‌డీ, ఈయూ నాణ్యతా ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఈ ప్లాంటును నిర్మించి నిర్వహిస్తారు. ఈ కీలక ఒప్పందం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న స్టెరైల్ ఇంజెక్టబుల్స్ డిమాండ్‌ను విజయవంతంగా తీర్చగలమని రెండు కంపెనీల సీనియర్ ప్రతినిధులు వెల్లడించారు.
అంతర్జాతీయ ఔషధ మార్కెట్లో సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ వ్యూహాత్మక కలయిక ఎంతగానో దోహదపడుతుందన్నారు.
