చరిత్రను కొత్తగా రాస్తున్నారా.. భారత్ ఎప్పటి నుంచో ఉంది కదా : మమతా బెనర్జీ

చరిత్రను కొత్తగా రాస్తున్నారా.. భారత్ ఎప్పటి నుంచో ఉంది కదా : మమతా బెనర్జీ

ఇండియాను భారత్ అని పిలువాలని అంటున్న కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సడెన్ గా ఈ మార్పు ఏంటని ప్రశ్నిస్తున్నాయి. పేరు మార్చితే ఒరిగేదేమిటని అంటున్నాయి. తాజాగా భారత్ గా పేరు మార్పుపై కేంద్రం తీరును పశ్చి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. 

‘‘ఆంగ్లంలో ఇండియా అంటున్నాం.. హిందీలో భారత్ కా సంవిధాన్ అంటున్నాం.. లేదా భారత్ అంటున్నాం.. ఇందులో కొత్తేముంది.. ఇండియా అనే పేరు ప్రపంచానికి తెలిసిందే. హఠాత్తుగా ఏం జరిగింది.. కొత్తగా భారత్ అని పేరు మార్చాలంటున్నారు.. చరిత్రను కొత్త రాస్తు్న్నారా’’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. 

జి20 సమ్మిట్ విందుకు భారత్ అధ్యక్షుడు పేరుతో ఆహ్వానం పంపడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశం చరిత్రను తిరగ రాస్తున్నారని మంగళవారం ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్  అధిష్టానం కేంద్రాన్ని ప్రశ్నిస్తూ.. హఠాత్తుగా ఇండియా పేరును భారత్ అని మార్చడం ఏంటని ప్రశ్నించారు.